హైదరాబాద్: డిసెంబర్ ఒకటో తేదీ వచ్చేసింది గ్యాస్ లిసిండర్ వినియోగదారులకు ఊరట కలిగించే తీపికబురు తీసుకువచ్చింది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర నిలకడగానే కొనసాగింది. సిలిండర్ ధరలో ఈ నెల కూడా ఎలాంటి మార్పు లేదని చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉంటూ వస్తున్న గ్యాస్ సిలిండర్ ధర ఈ నెల పెరుగుతుందని చాలా మంది భావించారు. కానీ ఈనెల కూడా ఎల్‌పీజీ సిలిండర్ ధర నిలకడగానే కొనసాగింది. దీంతో గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట కలుగనుంది.
హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్, నవంబర్ నెలలో కూడా గ్యాస్ సిలిండర్ ధరను స్థిరంగా కొనసాగించాయి. ఈనెల కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. 14 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం పెంచేశాయి. సిలిండర్ పై రూ.55 పెరిగింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర చెన్నైలో రూ.56 పెరుగుదలతో రూ.1410కు చేరింది. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1296 వద్ద ఉంది. రూ.55 పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.1351గా, ముంబైలో ధర రూ.1244గా ఉంది. ఈ ప్రాంతాల్లో సిలిండర్ ధర రూ.55 చొప్పున పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 01 Dec,2020 10:29AM