హైదరాబాద్: నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు పోలింగ్ మందకొడిగా కొనసాతుంది. పలుచోట్ల పోలీంగ్ అలస్యంగా ప్రారంభమైంది. ఓల్డ్ మలక్పేట డివిజన్లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఐ(ఎం) పార్టీ గుర్తు ముద్రించారు. ఎన్నికల అథారిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థుల గుర్తులు మారడంతో పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm