హైదరాబాద్: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితం ప్రజా పోరాటాలతోనే కొనసాగిందని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఆయన మరణం టీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని తెలిపారు. నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.కొత్తపేట మార్గదర్శి కాలనీలోని నోముల నివాసానికి చేరుకుని నరసింహ పార్థివదేహానికి మంత్రి కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
Mon Jan 19, 2015 06:51 pm