హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లిలో పోలింగ్ రసవత్తరంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. కూకట్‌పల్లి ఫోరంమాల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతూ.. బీజేపీ కార్యకర్తలకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతమైన వాతావరణం చోటు చేసుకుంది. అంతేకాకుండా టీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కారుపై కూడా బీజేపీ కార్యకర్తలు దాడి దిగారు. కారు అద్ధాలను ధ్వంసం చేశారు. మంత్రి కారులో డబ్బులు తరలిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు ఆరోపణలు చేసి దాడికి దిగారు. ఈ ఘర్షణలో ఒకరిద్దిరికి గాయాలు కూడా అయ్యాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న పోలీసులు కూడా లాఠీలతో చెల్లాదురుగా చేసి ఇరువర్గాలను సముదాయించారు.
Mon Jan 19, 2015 06:51 pm