హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సినీనటుడు విజయదేవరకొండ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భాగ్యనగరంలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మళ్లి 4వ తేదీన ఏమవుతోందో చూద్దామన్నారు. కరోనా భయంలేదని ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల అధికారులు తగిన ఏర్పాట్లు చేసిన్నట్లు తెలిపారు. పోలింగ్ బూత్ వద్ద శానిటైజర్లు పెట్టారని, ఓటర్లు సామాజిక దూరం పాటిస్తున్నారని.. అందుచేత ఎవరూ భయపడకుండా ఓటు వేయడానికి రావాలని విజయదేవరకొండ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm