ఢిల్లీ: భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతరేకిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపాట్టారు. దేశ రాజధానిలో ఎముకలు కోరికే చలిని సైతం లెక్కచేయకుండా రోడ్డలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనల హోరు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను కూడా కదిలించింది. ఈ మేరకు ట్రూడో ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ''భారత్‌లో రైతుల నిరసనలకు సంబంధించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితికి చింతిస్తున్నాము. అయితే మీకో విషయం చెప్పదలుకున్నా.. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది. సమస్యల పరిష్కారంలో చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే వివిధ మార్గాల ద్వారా భారత అధికారులను సంప్రదించాం. మనందరం.. ఒక్కతాటిపైకి వచ్చి సమస్యను పరిష్కరించేందుకు అనువైన సమయం ఇదే'' అని ఆయన కామెంట్ చేశారు. భారత రైతులు చేపడుతున్న నిరసనలపై స్పందించిన తొలి విదేశీ నేత ట్రూడోనే కావడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm