హైదరాబాద్ : జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపడం లేదు. ఇప్పటికి పోలింగ్ శాతం 20 శాతం కూడా దాటలేదు. ఈ పోలింగ్ కు తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా ఓటర్లు ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో 80 ఏళ్ల ఓ వృద్ధురాలు బయటకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ విషయాన్ని ఆమె మనవరాలు ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ఆ వృద్ధురాలికి ధన్యవాదాలు చెప్పారు. ఓటేయకుండా కేవలం కంప్లయింట్లకు పరిమితం అయ్యే వారికి ఆమె ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు కేటీఆర్.
Mon Jan 19, 2015 06:51 pm