హైదరాబాద్ : తుంగభద్ర పుష్కరాల చివరి రోజు విషాదం చోటుచేసుకుంది. అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. గొందిమల్లకు చెందిన రవి, లీలావతి దంపతుల కుమార్తె దీక్షిత, హరణి, శ్రీనివాసులు దంపతుల కుమార్తె మైథిలితో పాటు మరో ముగ్గురు బాలికలు నది వద్దకు వెళ్లారు. హరిణి దుస్తులు ఉతుకుతుండగా.. మరో నలుగురు పిల్లలు నదిలో స్నానం చేశారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఎక్కువగా లోతు ఉన్న గుంతలోకి వారు వెళ్లిపోయారు. అది గమనించిన హరిణి కేకలు వేయగా స్థానికులు ఇద్దరు చిన్నారులను కాపాడగా మిగతా ఇద్దరు నీటిలో మునిగిపోయారు. వారిని బయటికి తీసి ఆసుపత్రికి తీసుకొచ్చే మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటంబ సభ్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm