హైదరాబాద్ : జిల్లాలోని ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. అన్నోజిగూడలోని ఎన్‌టీపీసీ చౌరస్తా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి అన్నోజిగూడ ఎన్‌టీపీసీ చౌరస్తా వద్ద రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన పిడమర్తి సురేష్(55) సోమవారం రాత్రి నడుచుకుంటు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన సురేష్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చేప్పారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm