హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఉంది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఓల్డ్ మలక్‌పేటలో గుర్తుల తారుమారు అవ్వడంతో పోలింగ్‌ను రద్దు చేశారు. దీంతో ఈ నెల 3న ఓల్డ్ మలక్‌పేటలో రీపోలింగ్ జరగనుంది. దీంతో ఎల్లుండి సా.6 గంటల వరకు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడి నిషేధం. డిసెంబర్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. నగరంతో పోలిస్తే శివారుల్లో పోలింగ్ ఎక్కువగా నమోదైంది. ఆర్.సి.పురం-పటాన్‌చెరు, అంబర్‌పేట సర్కిళ్లలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మలక్‌పేట, కార్వాన్ సర్కిళ్లలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm