నవ తెలంగాణ రఘునాధపాలెం: మండల పరిధి గణేశ్వరం గ్రామపంచాయతీలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులను వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు. వారు మాట్లాడుతూ గణేశ్వరం లో ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా ఎరువు నిల్వ ఉంచారని, రహస్యంగా సమాచారం రావడంతో వెంటనే తనిఖీ చేసి ఎరువులను సిజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భాస్కర్ రావు, ఏ. డి. ఏ, హెచ్. ఈ. ఓ, గ్రామ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm