హైదరాబాద్ : పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అడ్డుపడుతున్నాంటూ ఏపీ సీఎం జగన్ ఆరోపిస్తుండడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందించారు. ఇళ్ల స్థలాలు ఇస్తుంటే మేం అడ్డుపడుతున్నట్టు ఆరోపణలు చేస్తున్నారు... ఇళ్ల స్థలాలుగా శ్మశానాలు, ఆవ భూములు, మడ భూములు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఎవరికో కడుపు మండి కోర్టుకు వెళితే మాపై విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల్లో అవినీతిపై విచారణ జరిపించండి అని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm