హైదరాబాద్: కాచిగూడ రెడ్డి కాలేజీ పోలింగ్ బూత్‌లో బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడినట్లు సమాచారం. ఎన్నికల అధికారులతో బీజేపీ అభ్యర్థి కుమ్మకై సమయం ముగిసిన తర్వాత లైట్లు ఆఫ్ చేసి రిగ్గింగ్ కు పాల్పడినట్లు తెలిసింది. ఇతర పార్టీల అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించలేదని సమాచారం. ఈ వ్యవహారంపై తాజాగా జాయింట్ సీపీ విశ్వప్రసాద్ స్పందించారు. కాచిగూడలో బీజేపీ అభ్యర్థి రిగ్గింగ్ ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆ సమయంలో బీజేపీ అభ్యర్థి బయటకు రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపణ చేశారని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm