హైదరాబాద్: గత కొద్ది రోజులుగా ఆలస్యం అవుతున్న కన్వీనర్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ తొలి విడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు హెల్త్ వర్సిటీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. బుధవారం ఉదయం 7గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm