హైదరాబాద్: చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇన్నోవా కారు బోర్‌వెల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరణించిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై చేవెళ్ల మండలం కందవాడ-మల్కాపూర్ శివారులోని ఈరోజు ఉదయం ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో కారులో కారు డ్రైవర్ సహా ఆరుగురు మరణించగా, మరొకరు తీవ్రవంగా గాయపడ్డారు. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌కు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసుల కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm