అమరావతి: ఏపీ అసెంబ్లీలో కరోనా వైరస్ కలకలం రేపింది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌రావుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కారుమురి హాజరు అయ్యారు. దీంతో ఆయనను కలిసిన ఎమ్మెల్యేలలో టెన్షన్ నెలకొంది. ఇప్పుడు ఇదే విషయం ఏపీ అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు నిన్న అసెంబ్లీలో కారుమురి నాగేశ్వరరావు ప్రసంగించారు. కోవిడ్ రావడంతో ఇవాళ్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు నాగేశ్వర్‌రావు దూరం కానున్నారు. ఆయనకు కలిసిన ఎమ్మెల్యేలు కూడా క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm