హైదరాబాద్ : అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. అమెరికా ప్రజలను కరోనా వదలడం లేదు. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసుల నమోదుతో పాటుగా అదే స్థాయిలో కరోనా మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో అక్కడ 2,500 మందికి పైగా వైరస్‌కు బలయ్యారు. ఏప్రిల్ తర్వాత అమెరికాలో ఒక రోజులో ఇంత అత్యధిక మరణాలు చోటుచేసుకోవడం మళ్లీ ఇప్పుడే అని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ వెల్లడించింది. 24 గంటల్లోనే 1,80,000లకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది. చివరిసారిగా ఏప్రిల్‌లో మహమ్మరి తీవ్రంగా విజృంభించిన సమయంలో ఒక్క రోజులోనే 2,562 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మంగళవారమే ఇంత ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించాయని యూనివర్శిటీ తెలిపింది.
రాబోయే రోజుల్లో కరోనా వ్యాప్తి మరింత విజృంభించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజుకు 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు అమెరికాలో 1.37కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవగా.. 2,70,000లకు పైగా మరణాలు సంభవించాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Dec,2020 12:28PM