హైదరాబాద్ : దేశం, తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు అమ్మాయిలు, మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా విశాఖలో దారుణ ఘటన జరిగింది. గ్రామ సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రియాంక అనే యువతిపై శ్రీకాంత్ అనే యువకుడు దారుణంగా కత్తితో దాడి చేశాడు. అనంతరం శ్రీకాంత్ ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖలోని ఫెర్రీ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వవ్యహారం కారణంగానే యువతిపై దాడి జరిగినట్టు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm