హైదరాబాద్ : ఇండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయింది. 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. విజయం కోసం పోరాడుతోంది. ఇప్పటికే ఓపెనర్ లాబుషేన్ (7), స్టీవ్ స్మిత్ (7), హెన్రిక్స్ (22), ఫించ్ (75) వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్‌లోనే వన్డే అరంగేట్రం చేసిన నటరాజన్ తొలి వికెట్ తీయగా.. ఆ తర్వాతి రెండు వికెట్లు శార్దూల్ ఠాకూర్ ఖాతాలోకి వెళ్లాయి. ఫించ్ వికెట్ ను జాడేజా తీసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 26 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm