హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కేసులు ఒకరోజు పెరగడం మళ్లీ తగ్గడం జరుగుతున్నది. ఇక తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొంది. పాజిటివ్ కేసుల సంఖ్య కొంత మేరకు తగ్గినట్టు కనిపిస్తున్నది. అయితే తెలంగాణలో కరోనా పాజిటీవ్ రేటు ఒక శాతం ఉందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం మీద 3.4 శాతం కరోనా యాక్టివ్ కేసుల రేట్ ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతోందని తెలిపారు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తెలంగాణపై లేకపోవచ్చు అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ నియంత్రణలో ఉందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలంతా వచ్చే వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని శ్రీనివాసరావు సూచించారు. ఎన్నికల తర్వాత కరోనా కేసుల పెరుగుదల గమనించేందుకు వారం రోజులు పడుతుందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm