హైదరాబాద్ : జీహెచ్ఎంసి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పోతంగల్లో కవితకు ఓటు హక్కు ఉందని ఫిర్యాదులో పేర్కాన్నారు. ఇప్పుడు బంజారాహిల్స్ లో ఓటు వేయడంపై టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత పోతంగల్‌లో ఉన్న ఓటు అలాగే ఉండగా ఇక్కడ ఎలా రెండో ఓటు వేశారని ప్రశ్నించారు. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కుమార్తే ఇలా రెండు చోట్ల ఓటు వేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగ పరుస్తూ దొంగ ఓటు వేసిన కవితకు ఎమ్మెల్సీగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఆధారాలతో ఫిర్యాదు చేశామని ఇందిరా శోభన్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm