హైదరాబాద్ : వారం రోజుల పాటు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రజలు భారీగా వచ్చారు. అయితే ఈ ప్రచారంలో పాల్గొన్న వారందరు క్వారంటెయిన్ లో ఉండాలని సూచించారు ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్. 5 నుంచి 7 రోజుల పాటు క్వారంటెయిన్ ఉండాలన్నారు. కోఠి లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా నియంత్రణలో ఉందని, పాజిటివ్ పర్సెంటేజ్ 1 శాతం మాత్రమే ఉందన్నారు. రికవరీ రేట్ ఎక్కువగా ఉందని అన్నారు. అయితే ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించిన కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరూ ఐసోలేషన్ లో ఉండాలని, కుటుంబ సభ్యులను కూడా దూరం పెట్టాలని ఆయన అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm