హైదరాబాద్ : కరోనా వేళ పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చి నుండి దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అయితే రాష్ట్ర స్థాయిలో ప్రయివేటు బస్సులు, పాఠశాలల బస్సులు, కాలేజీ బస్సులు, ఇతర సర్వీసు బస్సులకు చెల్లించే మోటారు వెహికిల్ టాక్స్ పై 100శాతం మినహయింపు ఇస్తున్నట్టు రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి డిసెంబర్ 31, 2020 వరకు బస్సులు వెహికిల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm