హైదరాబాద్ : కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజగా పంజాబ్ యువజన కాంగ్రెస్ నేతలు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముట్టడికి ర్యాలీగా బయల్దేరారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు వారిపై జలఫిరంగులు ప్రయోగించారు. అనంతరం వారిని నిర్బంధించారు. రైతుల పట్ల హర్యానా ప్రభుత్వం తీరును నిరసిస్తూ.. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇంటి ముట్టడికి పంజాబ్ యువజన కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో.. ఆయన నివాసానికి 3 కిలోమీటర్ల దూరంలో చండీగఢ్ పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లను ఉంచారు. అయినప్పటికీ.. కొందరు ఆందోళనకారులు బారికేడ్లను దాటి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.
దీంతో కాంగ్రెస్ నేతలపై వాటర్ కెనాన్ల ప్రయోగం చేయగా ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఛలో ఢిల్లీ నిరసన ప్రదర్శనను హరియాణా ప్రభుత్వం అడ్డుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. శాంతియుతంగా ర్యాలీగా వెళ్తోన్న తమపై పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారని.. అందుకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Dec,2020 05:06PM