హైదరాబాద్ : మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన చెన్నై హైకోర్టు మాజీ జడ్జి సీఎస్ కర్ణన్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. మహిళా న్యాయమూర్తులు, న్యాయమూర్తుల భార్యలపై ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేసినట్లు యూట్యూబ్ వీడియోల ద్వారా బహిర్గతమైంది. మహిళా జడ్జీలతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల భార్యల పరువునకు నష్టం కలిగేలా, వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ రూపొందించిన వీడియోలను కర్ణన్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోకపోవడంపై మద్రాస్ హైకోర్టు ఇటీవల చెన్నై పోలీసులపై మండిపడింది. దీంతో కర్ణన్‌ను చెన్నై పోలీసులు నేడు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm