హైదరాబాద్ : ఆస్ట్రేలియా పర్యటనలో టీం ఇండియా తన ఖాతాలో మొదటి విజయాన్ని సాధించింది. వన్డే సీరిస్ లో చివరిదైన మూడో వన్డేలో టీమిండియా గెలుపొందింది. తొలి రెండు వన్డేల్లో టీం ఇండియా దారుణంగా ఓడిన విషయం తెలిసిందిఏ. మూడో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఓదార్పు విజయాన్ని సొంతం చేసుకుంది. 13 పరుగులతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి పరిమితం చేయగలిగింది. చివరి వరకు పోరాడిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, బుమ్రా, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm