హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత ఆరు రోజుల నుంచి రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. వీరికి ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) మద్దతు ప్రకటించింది. దీంతో డిసెంబర్ 8 నుంచి ఉత్తర భారతదేశంలో సరుకు రవాణా వాహనాలను బంద్ చేస్తున్నట్లు ఏఐఎంటీసీ ప్రకటించింది. ఆ చట్టాలను రద్దు చేయకపోతే మొత్తం దేశవ్యాప్తంగా సరుకు రవాణాను నిలిపేస్తామని హెచ్చరించింది. డిసెంబర్ 8 నుంచి ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్, జమ్ముకశ్మీర్‌తోసహా అన్ని ఉత్తరాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో తమ వాహనాలను నిలిపివేస్తున్నట్లు ఏఐఎంటీసీ అధ్యక్షుడు కుల్తరన్ సింగ్ అత్వాల్ చెప్పారు.
అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే దేశవ్యాప్తంగా సరుకు రవాణాను నిలిపేస్తామని ఆయన స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Dec,2020 05:51PM