హైదరాబాద్: భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శామ్‌సంగ్ తన శామ్‌సంగ్ కెఫే మరియు శామ్‌సంగ్ స్మార్ట్ ప్లాజాతో కూడిన శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో గెలాక్సి స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసుకునే వారికి ఉత్సాహవంతమైన కార్యక్రమాలను ప్రకటించింది. ఈ నూతన కార్యక్రమాలను శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో గెలాక్సి స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసుకునే వారికి షాపింగ్ అనుభవాన్ని వృద్ధి చేయనుంది.
భారతదేశంలో శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో గెలాక్సి స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసుకునే వినియోగ దారులు ఇప్పుడు ఈ దిగువ పేర్కొన్న అనుకూలతలను పొందుతారు:
స్మార్ట్ క్లబ్ లాయల్టీ ప్రోగ్రామ్
ఈ కార్యక్రమంలో భాగంగా వినియోగదారులు రివార్డు పాయింట్లు, సర్వీస్ కూపన్లు తదితర ఆకర్షణీయమైన అనుకూలతలకు పొందేందుకు శామ్‌సంగ్ కెఫే లేదా శామ్‌సంగ్ స్మార్ట్ ప్లాజాలో కనీసం రూ.15,000 విలువైన గెలాక్సి స్మార్ట్‌ఫోన్లను మొదటిసారిగా కొనుగోలు చేసుకునే వారు అర్హతలను కలిగి ఉంటారు. ఈ రివార్డ్ పాయింట్లను శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో అనంతరం కొనుగోలు చేసుకునే సమయంలో వినియోగించుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు తమ స్మార్ట్ క్లబ్ సభ్యత్వం (డిసెంబరు 2020 వరకు అందుబాటులో ఉంటుంది)పై రూ.6,000 విలువైన మూడు వోచర్లను మరియు గెలాక్సి జడ్ ఫోల్డ్ 2 మరియు గెలాక్సి ట్యాబ్ ఎస్7 వంటి ఉత్పత్తులపై వేగవంతమైన అప్‌గ్రేడ్‌లను కూడా పొందుతారు.
శామ్‌సంగ్ రెఫరల్ ప్రోగ్రామ్
శామ్‌సంగ్ భారతదేశంలో అత్యంత పెద్ద వినియోగదారుల పరిధిని కలిగి ఉంది మరియు ఉపకరణాల వినియోగదారుల నుంచి అపారమైన ప్రేమను దక్కించుకుంది. ప్రస్తుతం శామ్‌సంగ్ వినియోగదారులకు వారి బంధుమిత్రులకు మహోన్నత సాంకేతితకను బహుమతిగా అందించేందుకు శామ్‌సంగ్ ఇప్పుడు తన రెఫరల్ ప్రోగ్రామ్‌ను శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో ప్రారంభించింది. శామ్‌సంగ్ వినియోగదారులు (రెఫరర్) తమ బంధుమిత్రులకు శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో స్మార్ట్‌ఫోన్ల శ్రేణిని కొనుగోలు చేసుకునే సమయంలో ఉత్సాహభరితమైన రివార్డులను పొందేలా సహకరించవచ్చు. రెఫరర్ (కొనుగోలు చేసుకునేందుకు సిఫార్సు చేసే శామ్‌సంగ్ వినియోగదారులు) అతని/ఆమె మిత్రులు మరియు కుటుంబానికి శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసుకునేందుకు విజయవంతమైన సిఫార్సు చేయడం ద్వారా రూ.7500 విలువైన అదనపు స్మార్ట్ క్లబ్ అనుకూలతలను పొందవచ్చు. విజయవంతమైన లావాదేవీల అనంతరం రెఫరర్ మరియు రెఫరీ ఇద్దరూ రివార్డు పాయింట్లను పొందవచ్చు.
శామ్‌సంగ్ తన వినియోగదారులకు రూ.5,000 నుంచి అందుబాటు ధరలో గెలాక్సి ఎ001 నుంచి రూ.150,000 ఫోల్డబుల్ గెలాక్సి జడ్ ఫోల్డ్2 వరకు ధరల్లో ఉత్పత్తులను అందిస్తున్న భారతదేశపు ఏకైక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఉంది. దానితో పెద్ద సంఖ్యలో శామ్‌సంగ్ వినియోగదారులు రిపీట్‌గా వస్తున్న వినియోగదారులుగా ఉండగా, వారి స్మార్ట్‌ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు వారు నిరీక్షిస్తుంటారు. అంతే కాకుండా ఈ వినియోగదారులు వారెంటీ మీరిన గెలాక్సి ఉపకరణాలను కలిగి ఉన్నారు. అటువంటి వినియోగదారులు తమ వారెంటీ ముగిసిన గెలాక్సి స్మార్ట్‌ఫోన్లను మరమ్మతు చేసుకునేందుకు కోరుకునే వారు అధీకృత శామ్‌సంగ్ సర్వీస్ సెంటర్‌కు వచ్చినప్పుడు 5% రాయితీ పొందుతారు. ఈ కూపన్లను శామ్‌సంగ్ స్మార్ట్ కెఫేలు, శామ్‌సంగ్ స్మార్ట్ ప్లాజాలు మరియు శామ్‌సంగ్ ఇ-స్టోర్ల నుంచి పొందవచ్చు. రాయితీ కూపన్లను వినియోగించే వినియోగదారులు కూడా ప్రస్తుత మార్కెట్లోని ఆఫర్లను కూడా అందుకునేందుకు అర్హతను కలిగి ఉంటారు.
వాట్సప్ చాట్‌బోట్
శామ్‌సంగ్ వాట్సప్ చాట్‌బోట్‌ను ప్రారంభించగా ఇది వినియోగదారులకు తమకు చేరువగా ఉన్న శామ్‌సంగ్ స్మార్ట్ కెఫేను కేవలం కొన్ని క్లిక్‌లలో సంప్రదించేందుకు సహకరిస్తుంది. శామ్‌సంగ్ స్మార్ట్ కెఫే వాట్సప్ సంఖ్య- 9870-494949కు ‘Hi’ సందేశం పంపించడం ద్వారా హోమ్ డెమో బుక్ చేసుకోవచ్చు, స్టోర్ల నుంచి కాల్ బ్యాక్ కోరుకోవచ్చు మరియు అత్యాధునిక ఆఫర్లు మరియు ఉత్పత్తుల విడుదల గురించి తెలుసుకునే రిక్వెస్టు పెట్టుకోవచ్చు. కొనుగోలు అనంతరం వినియోగదారులు వాట్సప్‌లో వారి లావాదేవీలకు ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను స్టోర్‌లో బిల్లింగ్ అనంతరం పంపించే ‘‘ఆప్ట్ ఇన్’’ లింక్ ద్వారా పొందుతారు.
‘‘శామ్‌సంగ్ గత కొన్ని నెలల నుంచి శామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను గెలాక్సి డివైజ్ వినియోగదారులకు సురక్షితమైన మరియు నిరపాయమైన స్టోర్లను గెలాక్సి డివైజ్ వినియోగదారులకు పలు ఇనీషియేటివ్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా మా అన్ని ఎక్స్‌క్లూజివ్ స్టోర్లకూ సురక్షత ప్రమాణీకరణ కలిగి ఉండగా, వినియోగదారులు మరియు ఉద్యోగులు వారి సౌఖ్యత మరియు సురక్షత విశ్వాసాన్ని అందిస్తున్నాయి. మా ఎక్స్‌క్లూజివ్ స్టోర్లలో గెలాక్సి డివైజ్‌లను కొనుగోలు చేసుకునే వినియోగదారులకు శామ్‌సంగ్ రెఫరల్ ప్రోగ్రామ్ అనే రాయితీ కూపన్ కార్యక్రమం మరియు శామ్‌సంగ్ క్లబ్ లాయల్టీ ప్రోగ్రామ్‌ను పరిచయం చేయడం ద్వారా కొనుగోలు చేసుకునే వారి ప్రయాణానికి నూతన ఆవిష్కరణలను పరిచయం చేసేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము. మేము మా వినియోగదారులకు శామ్‌సంగ్ వాట్సప్ చాట్‌బోట్ వంటి వర్చువల్ సేవలను అందించేందుకు కూడా కట్టుబడి ఉండగా, అది ఎక్కువ అనుకూలకరమైన వినియోగదారుల ప్రయాణాన్ని సృష్టించడంలో మా ప్రయత్నతాలను మరింత బలోపేతం చేయనుందని’’ శామ్‌సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ సీనియరు ఉపాధ్యక్షుడు మోహన్‌దీప్ సింగ్ తెలిపారు.