హైదరాబాద్: జస్లోక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో 38 ఏళ్ల సాక్షి శారద పుర్రె బేస్ వద్ద ఎనిమిది-కాంటాక్ట్ పాయింట్ ఎలక్ట్రోడ్లను (ఇంప్లాంట్) అమర్చడం ద్వారా నూతన తరహాలో శస్త్ర చికిత్సను నిర్వహించింది. సాక్షి 2018లో స్టేటస్ ఎపిలెప్టికస్ బారిన పడిన అనంతరం కార్డియో-రెస్పిరేటరీ అరెస్ట్ స్థితిని ఎదుర్కొని, ఇప్పుడు ఆ ప్రాణాంతక సమస్య నుంచి ఆమె పునర్జీవాన్ని పొందింది. శస్త్రచికిత్స అనంతరం ఆమెను 7 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉంచారు. అప్పటి నుంచి ఆమె పూర్తిగా మార్పు చెందిన చేతన స్థితిలోనే ఉంది. ఆమె పరిస్థితి తీవ్రంగా క్షీణించినప్పటికీ, ఆమె కుటుంబం ప్రతిసారీ, సాక్షి కోమా నుంచి బయట పడేందుకు సహకరించే పలు రకాల విధానాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
సాక్షికి ఫిజియో థెరపీ ఇప్పించగా, ఆమె కోమా స్థితి నుంచి కొద్దిగా చేతన స్థితికి చేరుకోవడం ప్రారంభించింది. పూర్తిగా మేలు కానప్పటికీ, ఆమె త్వరలో కోలుకుంటుందని ఆమె కుటుంబం ధీమాతో ఉంది. చికిత్సకు సంబంధించి అందుబాటులో ఉన్న విధానాల గురించి ఈమె కుటుంబం పరిశీలిస్తున్న సమయంలో డాక్టర్ పరేష్ దోషి గురించి, వారు చేసే ఫంక్షనల్ న్యూరో సర్జరీ గురించి తెలుసుకున్న ఆమె కుటుంబం డా.దోషిని సంప్రదించింది. ఈ తరహా సమస్యను ఎదుర్కొంటున్న వారికి, చక్కని ఫలితాలను అందుకునేందుకు జపాన్ దేశంలో కొన్ని శస్త్ర చికిత్స విధానాలను అనుసరించారని వారికి ఆయన వివరించారు. స్పైనల్ కార్డ్ సిమ్యులేషన్ విధానంలో చికిత్స చేయడమే సాక్షికి ఉత్తమ చికిత్స అని, ఆమె ప్రస్తుతం ఉన్న అచేతన స్థితి నుంచి కోలుకునేందుకు అవకాశం ఉంటుందని డా.దోషి వారికి వివరించారు.
శస్త్ర చికిత్స చేయించేందుకు ఆమె కుటుంబం సిద్ధం అయిన సమయంలోనే, దేశ వ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారి వేగంగా విస్తరించడం ప్రారంభమైంది.
ఏదేమైనప్పటికీ, సాక్షికి ఉత్తమమైన చికిత్స త్వరగా అందుతుందని లభిస్తుందని ఆమె కుటుంబం ఎంతో ఆసక్తిగా వేచి చూశారు. రోగి సురక్షితను నిర్ధారించేందుకు జస్లోక్ ఆసుపత్రి తీసుకునే వివిధ జాగ్రత్తల గురించి డా.దోషి ఆమె కుటుంబానికి వివరించారు. ఆమెకు ఏదైనా శస్త్రచికిత్స చేసేందుకు ముందుగా కొనిన నిర్దిష్ట క్లినికల్ ప్రమాణాలను అనుసరించలసి ఉంటుంది. వాటిని పాటించకపోతే, కుటుంబం ఆమోదం తెలిపినా, శస్త్ర చికిత్స చేయించుకునేందుకు రోగి నిరాకరించేందుకు అవకాశం ఉంటుంది. మల్టీడిసిప్లినరీ వైద్య బృంద సభ్యులు ఆమె స్థితిగతుల గురించి మూల్యాంకన చేయగా, ఇందులో న్యూరో ఫిజియాలజిస్ట్ - పూర్ణిమ కోటియన్, డా.ప్రీతి దోషి - డైరెక్టర్, పెయిన్ మేనేజ్‌మెంట్, డా.విక్రమ్ లెలే- డైరెక్టర్, న్యూక్లియర్ మెడిసిన్ మరియు న్యూరో సర్జరీ డైరెక్టర్ డా.పరేష్ దోషి ఉన్నారు. సాక్షి మెదడు రక్త ప్రసరణను తీరును గుర్తించేందుకు న్యూక్లియర్ మెడిసిన్ స్కాన్లు చేశారు. వైద్యులు శస్త్ర చికిత్స చేసేందుకు కావలసిన అన్ని క్లినికల్ ప్రమాణాలను ఆమె అందుకున్నారు.
అక్టోబర్ 1న, ఆమెకు సాధారణ అనస్థీషియా ఇచ్చి గర్భాశయ వెన్నుపూసను స్టిమ్యులేట్ చేశారు. పెయిన్ స్పెషలిస్ట్ డా.ప్రీతి దోషి 8-కాంటాక్ట్ పాయింట్ ఎలక్ట్రోడ్‌ను మిడ్-థొరాసిక్ ప్రాంతం నుంచి ఎక్స్‌రే మార్గదర్శకత్వంలో పుర్రె బేస్ వరకు ప్రవేశపెట్టారు. శస్త్ర చికిత్స విజయవంతం అయ్యేందుకు ఈ ఎలక్ట్రోడ్‌ల స్థానం చాలా కీలకమైనది. ఈ విధానంలో రోగికి ఎటువంటి సమస్య ఎదురు కాలేదు మరియు ఎలక్ట్రోడ్‌లు సరైన స్థానంలో అమర్చారని ఎక్స్-రే చిత్రాలతో నిర్ధారించారు. అనంతరం పేస్‌మేకర్‌ను ఎడమ పార్శ్వంలో డా.పరేష్ దోషి అమర్చారు.
రోగి మెదడులోని రక్త ప్రసరణను మెరుగుపరచి, ఆమె తిరిగి సృహలోకి వచ్చుందకు అక్టోబర్ 3న, గర్భాశయ వెన్నెముకు స్టిమ్యులేట్ చేసేందుకు పేస్ మేకర్ ప్రోగ్రామింగ్‌తో వైద్యుల బృందం తదుపరి చికిత్సను ప్రారంభించారు. ఆమెకు 2 రోజుల స్టిమ్యులేషన్ తరువాత, రోగి కొంత అప్రమత్తమై చేతనావస్థలోకి వచ్చిందని, ప్రతిస్పందనలు మెరుగుపడి, చేతులు మృదువుగా మారాయని, తేలికగా కదిలిస్తోందని కుటుంబ సభ్యులు గుర్తించారు.
డా.పరేష్ దోషి మాట్లాడుతూ, 'భారతదేశంలో అటువంటి రోగికి వెన్నుపూసను స్టిమ్యులేషన్ చేసి శస్త్ర చికిత్స చేయడం మొదటిసారి. ఇది క్లిష్టమైన శస్త్ర చికిత్స మరియు రానున్న నెలల్లో సాక్షి స్థితిలో మెరుగుదల కనిపిస్తుందని మేము ఆశిస్తున్నాము. వచ్చే 6 నెలల్లో ఆమె చేతులు మరియు ముఖంలో కదలికలు రావచ్చని' పేర్కొన్నారు. ఆమె రోజంతా ఉత్తేజితమవుతోంది మరియు ఆమె మెదడుకు రాత్రుళ్లు విరామం ఇస్తున్నారు. కనుక ప్రాథమికంగా, ఆమెకు రోజులో 12 గంటల స్టిమ్యులేషన్ ఉంటుంది. వైద్యులు చాలా ఆశాజనకంగా ఉండగా, సాక్షి కోలుకునేందుకు 3-4 నెలలు పడుతుందని భావిస్తున్నారు.
వైద్య విధానాలను సరికొత్తగా ఆవిష్కరించడం ద్వారా రానున్న సంవత్సరాల్లో మరిన్ని విజయాలు సాధిస్తామని ఈ వైద్యుల బృందం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Dec,2020 06:04PM