హైదరాబాద్ : బురేవి తుఫాన్ భారత్ వైపు దూసుకొస్తున్నది. ఈరోజు సాయంత్రం ట్రింకోమలి సమీపంలో శ్రీలంక తీరాన్ని దాటి రేపు ఉదయానికి ఈ తుఫాన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. బురేవీ తుఫాన్ నేపథ్యంలో భారత్ వాతావరణ కేంద్రం కేరళలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. తుఫాన్ ప్రభావంతో డిసెంబర్ 3న కేరళ తీరప్రాంతంలోని తిరువనంతపురం, కొల్లాం, పథనంథిట్ట, అలప్పుజ జిల్లాల్లో భారీ వర్షాలతోపాటు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 02 Dec,2020 06:26PM