హైదరాబాద్ : ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడిపై యువతి బంధువులు దాడికి పాల్పడిన ఘటనలో యవకుడు మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం కౌల్పూర్లో చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహరం వల్ల యువకుడిపై యువతి బంధవులు దాడి చేయటంతో యువకుడు తీవ్ర గాయాలతో గత 25 రోజులుగా హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేష్ అనే యువకుడు నేడు మృతి చెందాడు. దీంతో యువతి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm