Spoke to Kerala CM Shri @vijayanpinarayi Ji on the conditions prevailing due to Cyclonic Storm Burevi in the state. Assured all possible support from the Centre to help Kerala. Praying for the safety and well-being of those staying in the affected areas.
— Narendra Modi (@narendramodi) December 2, 2020
ఢిల్లీ: ఈ నెల 4న దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, పాంబన్ మధ్య బువేరి తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అధికార యంత్రాంగాలు అప్రమత్తమై తుఫాను నష్టాన్ని తగ్గించడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. తుఫాన్ పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీ తనకు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందుజాగ్రత్త చర్యల గురించి ప్రధానికి వివరించానని విజయన్ తెలిపారు. తీర ప్రాంత జిల్లాల్లో ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.