హైదరాబాద్ : ఉయ్యాల ఊగుతుండగా తాడు మెడకు చుట్టుకొని బాలిక మృతి చెందింది. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. నజ్రుల్‌నగర్ గ్రామం నెంబర్ 9కు చెందిన సమర్ సర్కార్, బబితా సర్కార్ దంపతులకు నలుగురు కూతుళ్లు. బుధవారం ఉదయం పెద్దకుమార్తెను తీసుకొని తల్లిదండ్రులు పొలం వెళ్లారు. రెండోకుమార్తె రియాసర్కార్ (10) ఇంటి వద్ద ఉండి ఇద్దరు చెల్లెలను ఆడిస్తోంది. మధ్యాహ్నం బాలిక ఊయల ఊగుతుండగా తిరగబడి తాడు మెడకు చుట్టుకుపోయి బిగిసుకొని మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
Mon Jan 19, 2015 06:51 pm