హైదరాబాద్: తెలంగాణలో ఐసెట్ కౌన్సెలింగ్ ఈనెల 6 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 6న మొదటి విడత కౌన్సెలింగ్ మొదలవుతుండగా జాబితాను 15న ప్రకటిస్తారు. అలాగే రెండో విడత ఈనెల 22న ప్రారంభం కానుండగా సీట్లను 26న ప్రకటిస్తారు. స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ వివరాలను ఈనెల 28న ప్రకటించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm