హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు 300గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బంగారం స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. అతడు బంగారాన్ని కరిగించి గోలీలుగా మార్చి ప్యాంటు జిప్ కింద భాగంలో తీసుకువచ్చాడు. నడక చూసి అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు విచారించగా ఈ బంగారం స్మగ్లింగ్ గుట్టు బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం 14 లక్షల విలువ ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
Mon Jan 19, 2015 06:51 pm