హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఓల్డ్ మలక్పేట డివిజన్‌లో రీపోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. గుర్తులు తారుమారైన నేపథ్యంలో 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓల్డ్ మలక్పేట డివిజన్‌లో మొత్తం 54,502 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 27,811 మంది కాగా... మహిళా ఓటర్ల సంఖ్య 26,688. ఇతరులు ముగ్గురున్నారు. 23 పోలింగ్ కేంద్రాల్లో ఈసీ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఓల్డ్ మలక్పేట డివిజన్లో ఇవాళ సెలవు ప్రకటించారు. రీపోలింగ్ దృష్ట్యా అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm