హైదరాబాద్ : అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో ప్రతీరోజు లక్షలో సంఖ్యలో పాజిటివ్ కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నారు. తాజాగా అమెరికాలో నిన్న ఒక్కరోజే 2731 మంది కరోనాకు బలి కాగా, కొత్తగా 1,95,121 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,43,13,941కు చేరింది. ఇందులో 55,71,729 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 84,62,347 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా బారినపడి చనిపోయినవారి సంఖ్య 2,79,763కు చేరింది. నిన్న 2731 మంది మరణించడంతో.. ఏప్రిల్ తర్వాత ఇంత పెద్దసంఖ్యలో బాధితులు మృతిచెందడం ఇదే మొదటిసారి.
Mon Jan 19, 2015 06:51 pm