హైదరాబాద్ : నివర్ తుఫాన్ ముప్పు ఇంకా తగ్గక ముందే బురేవీ ముంచుకొస్తున్నది. ఈ తుఫాన్ కారణంగా తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. బురేవీ తుఫాన్ గత ఆరు గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లి త్రికోణమలికి వాయువ్య దిశలో 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. బురేవి తుపాన్ ప్రభావం వల్ల త్రివేండ్రం జిల్లాలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, వైమానిక దళం, నావికాదళ సిబ్బందితో 8 బృందాలను సహాయ చర్యల కోసం మోహరించామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. లోతట్టుప్రాంతాల్లో ఉన్న 175 కుటుంబాలకు చెందిన 697 మందిని సహాయ శిబిరాలకు తరలించారు. బురేవి తుపాన్ ముప్పు దృష్ట్యా గురువారం తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అల్లప్పుజ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 03 Dec,2020 08:53AM