హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొంత మేరకు తగ్గినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 609 కరోనా కేసులు నమోదు కాగా కరోనాతో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 2,71,492 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,61,028 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 8,999 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కరోనాతో 1465 మంది మృతి చెందారు.
Mon Jan 19, 2015 06:51 pm