హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో గుర్తులు తారుమారైన సందర్భంగా ఓల్డ్ మలక్పేట డివిజన్‌లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఈరోజు 69 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు వేస్తున్నారు. ఓల్డ్ మలక్పేట డివిజన్లో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ 4.44శాతంగా నమోదైంది. రీపోలింగ్ దృష్ట్యా అన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపార కేంద్రాలకు సెలవు ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm