హైదరాబాద్ : ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసారు పోలీసులు. గత ఆదివారం మంత్రి నానిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రుల నివాసాలు, వారి కార్యాలయాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. గుడివాడలోని కొడాలి నాని నివాసం వద్ద మెటల్ డిటెక్టర్, డిజిటల్ స్కానర్లను ఏర్పాటు చేశారు. నాని నివాసంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఆయన నివాసాన్ని భద్రతా సిబ్బంది తన అధీనంలోకి తీసుకుంది. మంత్రిని కలిసేందుకు వస్తున్న ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆ తర్వాతే ఆయన నివాసంలోకి అనుమతిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm