హైదరాబాద్ : మొన్నటి వరకు తమిళనాడు, ఏపీలో నివర్ తుఫాన్ ప్రతాపం చూపించింది. నివర్ ధాటికి ఇంకా ప్రజలు, రైతులు తేరుకోనే లేదు. ఇంతలోనే బురేవీ తుఫాన్ మళ్లీ విరుచుకుపడింది. తుఫాన్ల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురేవీ కారణంగా పలు విమానాలు రద్దు అయ్యాయి. చెన్నై ఎయిర్ పోర్టులో 6 విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై నుంచి కొచ్చిన్, తూత్తుకుడి, తిరుచ్చి వెళ్లే విమానాలను అధికారులు రద్దు చేశారు. అలాగే.. కొచ్చిన్, తూత్తుకుడి నుంచి చెన్నై వెళ్లే విమానాలు కూడా రద్దయ్యాయి. బురేవీ తుఫాన్ కారణంగా పలు రైళ్లు కూడా రద్దయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm