హైదరాబాద్ : గ్రీస్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించారు. ఇటీవలి నెలల్లో వ్యాధి కారణంగా ప్రతిరోజూ అనేకమంది మరణిస్తున్నారు. వైరస్ కారణంగా ఇప్పటికే 2,600 మందికి పైగా మరణించారు. బుధవారం ఒక్కరోజే 2,200 కొత్త కేసులు నమోదవగా దాదాపు 90 మంది చనిపోయారు. నవంబర్ 7న మూడు వారాల పాటు విధించిన లాక్‌డౌన్‌ను తొలుత డిసెంబర్ 7 వరకు పొడిగించారు. తాజాగా 14వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి స్టెలియోస్ పెట్సాస్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm