హైదరాబాద్ : పెళ్లి బృందంతో వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో బోల్తాపడి ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘడ్ జిల్లాలో చోటు సంభవంచింది. మృతులను ఒడిశాలోని బర్ఘాడ్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా కిరోడిమాల్ నగర్ ప్రాంతంలో జరిగిన బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm