భారతదేశంలో అగ్రగామి వెల్‌నెస్ బ్రాండ్లలో ఒకటైన ది హిమాలయ డ్రగ్ కంపెనీ నేడు తన ఆరోగ్యకరమైన నూతన హిమాలయ యాంటీ-హెయిర్ ఫాల్ షాంపూకు సంబంధించిన ప్రచార చిత్రం ‘‘హెయిర్ ఫాల్ కాదు, ఇప్పుడు కేవలం జీవితం నా గుప్పెట్లో ఉంది’’ను హెల్తీ హెయిర్ కా వాదా క్యాంపెయిన్‌లో భాగంగా విడుదల చేసింది. ఈ సరికొత్త క్యాంపెయిన్ జుట్టు సంరక్షణ విభాగంలో వినియోగదారులు ఎదుర్కొనే జుట్టు రాలిపోయే ప్రముఖ సమస్యను నివారించడాన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. సహజసిద్ధమైన- ఉత్పత్పుల ఆధారిత పరిష్కరణల గురించి ప్రజలకు మక్కువ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ క్యాంపెయిన్ హిమాలయ యాంటీ-హెయిర్ పాల్ షాంపూ జుట్టు రాలిపోకుండా విశ్వసనీయ పరిష్కరణ అని ప్రత్యేకంగా నిలువనుంది. ఈ చిత్రం ప్రస్తుత సందర్భానికి తగినట్లు రూపొందించగా, నేటి మహిళలు అది విద్య అయినా, లేదా తమకు ఆసక్తి ఉన్నదాని కోసం గాలించడమైనా, అన్నింటిలోనూ ఎలా విజేతలుగా నిలుస్తారనే దాన్ని ఇది చాటి చెబుతుంది. వారికి అన్నీ నియంత్రణలో ఉన్నప్పటికీ జుట్టు రాలిపోవడం అనేది చాలా ఆందోళన కలిగించే అంశంగా ఉంది.
ఈ వాణిజ్య చిత్రంలో కళాశాలకు వెళ్లేందుకు సిద్ధమై నిలబడిన యువతి ఒకరు తన పిడికలి బిగించి: ‘‘నా జీవితం నా గుప్పెట్లో ఉంది’’అంటుంది. అయితే ఆమె తన జుట్టుపై వేళ్లను కదిలిస్తున్న సమయంలో, తెగిపడిన కొంత జుట్టు ఆమె చేతిలో మిగిలిపోతుంది. ఈ వాణిజ్య చిత్రం ఔషధ గుణాలు కలిగిన వనమూలికలు మరియు విశ్వసనీయ హిమాలయ యాంటీ-హెయిర్ ఫాల్ షాంపూ జుట్టు సమస్యలను పరిష్కరించేందుకు వినియోగదారులకు ఎలా సహకరిస్తుందనే దాన్ని ఇందులో చూడవచ్చు. భృంగరాజ మరియు పలాశ వంటి సరైన సహజసిద్ధమైన ఉత్పత్తులతో హిమాలయ యాంటీ-హెయిర్ ఫాల్ షాంపూ జుట్టును బలోపేతం చేయడం ద్వారా జుట్టు రాలడాన్ని తక్కువ చేస్తుంది మరియు ఆరోగ్యవంతమైన శిరోజాల భరోసాను ఇస్తుంది.
ది హిమాలయ డ్రగ్ కంపెనీ హెయిర్ కేర్ కేటగిరీ మేనేజర్ విభు గంగాల్ మాట్లాడుతూ ‘‘ఈ నూతన కమ్యూనికేషన్ ‘‘హెయిర్ ఫాల్ కాదు, ఇప్పుడు కేవలం జీవితం నా గుప్పెట్లో ఉంది’’ను మా ప్రముఖ షాంపూ మోడల్‌కు మద్దతుగా తెరకెక్కించాము. ఈ చిత్రం విశ్వసనీయమైన పరిష్కరణను పొందేందుకు ముందుగా జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు మహిళలు పలు ప్రయత్నాలను చేయడాన్ని ఇందులో చూపించాము. ఈ వాణిజ్య చిత్రంలో సందేశం సరళంగా ఉంది మరియు మా కమ్యూనికేషన్ ద్వారా మేము వినియోగదారులకు సరైన ఎంపిక చేసుకునేందుకు మద్దతు ఇచ్చే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. హిమాలయ 90 ఏళ్లకు పైచిలుకు విశ్వసనీయ భాగస్వామిగా వినియోగదారులకు అత్యంత ప్రియమైన బ్రాండ్‌గా నిలిచింది. ఈ టీవీ వాణిజ్య ప్రకటన జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు సహకరించే మా సహజసిద్ధమైన ఉత్పత్తులను కలిగిన ఉత్పత్తులకు మద్దతుగా నిలుస్తుందని’’ వివరించారు.
బెంగళూరుకు చెందిన 82.5 కమ్యూనికేషన్ గ్రూపు క్రియేటివ్ డైరెక్టర్స్ సంగీత సంపత్ మరియు రవికుమార్ చెరుస్సోలా తమ సృజనశీలమైన ఆలోచనను వివరిస్తూ ‘‘నేటి యువతి విశ్వాసంతో అలానే వారి జీవితానికి సంపూర్ణ నియంత్రణను కలిగి ఉంది. ఆమె తన సమస్యలను తన జీవితానికి అడ్డంకి అని చూడడం లేదు. దాని బదులుగా ఆమె పరిష్కరణ కోసం నిరీక్షిస్తోంది. మరియు అదే ఆమె జుట్టు రాలే సమస్యకూ అన్వయిస్తుంది. అక్కడే హిమాలయ ఒక బ్రాండ్‌గా వస్తుంది మరియు ఆమెకు సంపూర్ణ నియంత్రణ తీసుకునేందుకు సహకరిస్తోంది. మేము దీన్ని వాస్తవం చేయాలని కోరుకునానము, దానితో యువతులు మా భరోసానూ నిజంగా అర్థం చేసుకుంటారని’’ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 03 Dec,2020 08:24PM