బెంగళూరు: టాయ్ టెక్నాలజీలో నవ్యతని ముందుకు తీసుకురావడానికి మరియు గౌరవనీయ ప్రధాన మంత్రి ఆత్మనిర్భార్ భారత్ మిషన్ కి మద్దతు ఇవ్వడానికి స్కిల్లెంజా సహకారంతో ‘ToyathonChallenge2020’ Amazon.in నేడు ప్రకటించింది. చదువు, వినోదం, నిమగ్నమవడం పై కీలకమైన దృష్టి కేంద్రీకరణతో పిల్లలు కోసం బోధనా సాధనాలుగా బొమ్మల్ని రూపొందించడానికి కలిసికట్టుగా ముందుకు రావడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు నుండి యువ నవతాళీకులు కోసం టాయ్ హాకథాన్ ఒక వేదికని కేటాయిస్తుంది. ToyathonChallenge2020 జాతీయ విద్యా విధానం 2020 కలకు అనుగుణంగా, దేశవ్యాప్తంగా ఉన్న పిల్లలు కోసం సంజ్ఞానాత్మక అభివృద్ధికి సాధనాలుగా ఉపయోగించబడటానికి మరియు భారతదేశపు గుర్తింపును, చరిత్ర, కథనం ఇవ్వడానికి ప్రధాన సాధనంగా బొమ్మలకు ప్రాథాన్యతనిచ్చింది.
ఇంకా, ఈ విలక్షణమైన చొరవ కొత్త టాయ్ టెక్నాలజీలతో దేశీయ మార్కెట్ ని సృష్టించింది మరియు వినోదాత్మక వాడకంతో పాటు పిల్లల సంపూర్ణాభివృద్ధి కోసం నేర్చుకునే సాధనాలుగా బొమ్మల్ని అభివృద్ధి చేయడానికి భారతదేశఫు సంప్రదాయబద్ధమైన కళా నైపుణ్యం తయారీ ప్రక్రియలకు మళ్లీ ప్రయోజనం కలిగించడానికి ఒక లోతైన పరిథిని కేటాయిస్తుంది. ఈ అవకాశాన్ని కలగచేయడం ద్వారా, అమేజాన్ దేశీయంగా పెరిగిన తలెత్తుతున్న భారతీయ బ్రాండ్స్ మరియ తయారీదారుల్ని ప్రోత్సహిస్తుంది మరియు ప్రభుత్వ మిషన్ కి మద్దతునిస్తూనే 'మేడ్ ఇన్ ఇండియా' బొమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, శ్రీ రమేష్ పొఖ్రియాల్, గౌరవనీయ యూనియన్ విద్యా శాఖ మంత్రి, భారత ప్రభుత్వం ఇలా అన్నారు, “గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఊహించిన విధంగా, బొమ్మల పరిశ్రమ విస్త్రతమైనది మరియు పిల్లల సంపూర్ణాభివృద్ధికి నేర్చుకునే సాధనాలుగా ఉపయోగించబడే బొమ్మల్ని అభివృద్ధి చేయడానికి మన సంప్రదాయబద్ధమైన కళా తయారీ ప్రక్రియలకు మళ్లీ ప్రయోజనం కలిగించడానికి భారతదేశం కోసం లోతైన పరిధి ఉంది. టాయ్ టెక్నాలజీలో నవ్యతల్ని ప్రోత్సహించడానికి మరియు భారతదేశపు నైతికత మరియు విలువల్ని ప్రతిబింబించడాన్ని రూపొందించడంలో నవ్యతల్ని ప్రోత్సహించడానికి అమేజాన్ ద్వారా టాయ్ హాకథాన్ ToyathonChallenge2020ని ప్రారంభించడానికి నేను ఆనందిస్తున్నాను. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తుని కలగచేయడానికి కలిసికట్టుగా యువత ఆరంభించేలా చేసే అటువంటి చొరవతో బ్రాండ్ ముందుకు రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. అమేజాన్ ఇండియా టీంకి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలుపుతున్నాను, మరియు ఈ చొరవను గొప్ప విజయంగా చేస్తున్న పాల్గొంటున్న వారు అందరికీ శుభాకాంక్షలు తెలపుతున్నాను”.
తన ప్రసంగంలో, శ్రీ అమిత్ అగర్వాల్, గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ హెడ్, అమేజాన్ ఇండియా ఇలా అన్నారు, “భారతదేశపు బొమ్మల తయారీ పరిశ్రమ విలక్షణమైనది మరియు అంతర్జాతీయ పరిశ్రమకి మన తోడ్పాటుని పెంచడంలో సహాయం చేస్తుంది. గౌరవనీయ ప్రధాన మంత్రి ఆత్మనిర్భార్ భారత్ మిషన్ లో భాగంగా పని చేయడానికి మరియు భవిష్య తరాలు కోసం భారతదేశపు విలువలు మరియు నీతి సూత్రాలను ప్రతిబింబించే బొమ్మల్ని రూపొందించడానికి భారతీయ యుతవని ప్రోత్సహించడానికి మేము ఆనందిస్తున్నాము. స్థానిక కళాకారులు మరియు తయారీదారుల్ని మద్దతు చేయడానికి వివిధ చొరవలు ద్వారా ఎంఎస్ఎం ఆవరణ వ్యవస్ధని ఆరంభించడానికి మేము కట్టుబడ్డాము. తమ సృష్టిని చూపించడానికి ప్రముఖ భారతీయ బొమ్మల తయారీ బ్రాండ్ తో భాగస్వామం చెందడానికి విజేతలు అవకాశాన్ని పొందే స్థానిక సాధికారతకు మా నిబద్ధత దిశగా ToyathonChallenge2020 మరొక అడుగు.”
భారతదేశంలో ఏదైనా ఉన్నత విద్యా సంస్థల్లో తమ పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు హాకథాన్ లో పాల్గొనడానికి అర్హులు. రిజిస్ట్రేషన్ తరువాత మరియు 9-12 వారాల దీర్ఘమైన వర్ట్యువల్ పోటీ నాలుగు దశల్లో నిర్వహించబడుతుంది, జ్యూరీ ఎంట్రీల్ని మూల్యాంకనం చేస్తుంది మరియు విజేతలు ప్రకటించబడతారు.
మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల్ని ప్రోత్సహించడానికి గత ఎన్నో నెలలుగా, Amazon.in పలు చొరవల్ని పరిచయం చేసింది. ఈ ఏడాది ఆరంభంలో, Amazon.in హ్యాండిక్రాఫ్ట్స మేళా వంటి చొరవల్ని ఆరంభించింది మరియు అమేజాన్ కారిగార్ కార్యక్రమం నుండి 8 లక్షలకు పైగా కళాకారులు మరియు నేత పని వారికి ప్రయోజనం కలిగించిన చేతి తయారీ చొరవ కోసం సహాయాన్ని అందించింది మరియు అమేజాన సహేలి కార్యక్రమం నుండి 2.8 లక్షల మహిళా ఔత్సాహికులకు ప్రయోజనం కలిగించింది. అమేజాన్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, వెస్ట్ బెంగాల్ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ (Gramin), ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ (Vindhya Valley మధ్యప్రదేశ్ నుండి ), మరియు వెస్ట్ బెంగాల్ హ్యాండీక్రాఫ్ట్స్ డవలప్ మెంట్ కార్పొరేషన్ (MANJUSHA) వంటి పలు ఎంపోరియాల్ని కూడా ప్రారంభించింది, భారతదేశఫు అన్ని రకాల కళల్ని ఆన్ లైన్ లో తీసుకువచ్చి మరియు కళాకారులు మరియు నేత పనివారి అభివృద్ధి చేయాలని తన మిషన్ లో భాగంగా క్రాఫ్ట్ మార్క్ ధృవీకరించిన ఉత్పత్తులు మరియు దస్తకారీ హాథ్ సమితిని ఆరంభించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 03 Dec,2020 08:46PM