హైదరాబాద్ : నకిలీ కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంటర్ పోల్ హెచ్చరించింది. ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఏకంగా 3వేల నకిలీ వ్యాక్సిన్ వెబ్‌సైట్లు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంంది. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వాళ్లు నకిలీ కొవిడ్ వ్యాక్సిన్స్‌ను అమ్ముతారని హెచ్చరించింది. ఈ మేరకు 194 దేశాల్లోని అన్ని పోలీసు వ్యవస్థలకు ఆరెంజ్ నోటీస్ లు జారీ చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా పైజర్ వ్యాక్సిన్‌కు యూకే అనుమతించిన రోజే ఇంటర్‌పోల్ ఈ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm