హైదరాబాద్ : ఉత్తరాది రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈరోజు ఉదయం ఒడిషా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఒడిశాలోని మయూర్ భంజ్ లో తెల్లవారుజామున 2.13 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఉత్తరాఖండ్ లోని పితోరాఘడ్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు భూమి కంపించింది. పితోరాఘడ్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలాజీ శాస్త్రవేత్తలు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm