హైదరాబాద్ : ఈరోజు నుండి తెలంగాణలో థియేటర్లు ఓపెన్ కానున్నాయి. కరోనా ప్రభావంతో దాదాపు 9 నెలలుగా తెరుచుకోని థియేటర్లు నేడు పున: ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సినిమా హాళ్లలో ప్రదర్శనలు మొదలుపెట్టాలని తెలంగాణ సినిమా థియేటర్ల యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు తెలుగు నిర్మాతల మండలితో... మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమానులు జరిపిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. కేవలం 50 శాతం ప్రేక్షకులతోనే సినిమాలను ప్రదర్శించాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సీటుకు సీటుకు మధ్య క్రాస్ మార్క్ చేశారు. టికెట్ కౌంటర్ల వద్ద దూరం పాటిస్తూ... తప్పనిసరిగా మాస్క్ ధరించాలనే బోర్డులను ఏర్పాటు చేశారు. హాల్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
ఈ క్రమంలో తొలుత హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శించాలని నిర్ణయించారు. అందులో భాగంగా టెనెట్ చిత్రంతో థియేటర్లను పునఃప్రారంభిస్తున్నారు. 2 వారాల తర్వాత తెలుగు సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు, పంపిణీదారులు సిద్ధమవుతున్నారు. నాని నటించిన వీ సినిమాను ఈనెల 18న థియేటర్లలో విడుదల చేయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Dec,2020 07:24AM