హైదరాబాద్ : నల్గొండ జిల్లా కేంద్రానికి కోణం సందీప్(25) ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్ రూపొందించినందుకు సందీప్‌కు ఈ గౌరవం దక్కింది. ఇతర దేశాల్లోని వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలను అత్యంత భద్రంగా రోగులకు వారి మాతృ భాషల్లోకి ఈ యాప్ తర్జుమా చేసి అందిస్తుందని సందీప్ తెలిపారు. ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేష కృషి చేసిన 30 ఏళ్ల లోపు యువకులతో ఆ సంస్థ రూపొందించిన 30 అండర్ 30 జాబితాలో సందీప్ పేరును చేర్చింది. ఈ నెల 1న అమెరికాలో దీనిని విడుదల చేసింది. 2018లో డా.శివరావ్‌తో కలిసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో అబ్రిడ్ పేరుతో హెల్త్‌కేర్ గ్రూప్ సంస్థను స్థాపించిన సందీప్.. వైద్యరంగంలో ఎదురవుతున్న సవాళ్లపై పరిశోధనలు చేస్తున్నారు.
ఇడుపులపాయ ఆర్‌జీయూకేటీలో ఇంజినీరింగ్ చదివిన సందీప్.. అమెరికాలోని కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయంలో రోబోటిక్స్ విభాగంలో ఎంఎస్ పూర్తిచేశారు. పలు హెల్త్‌కేర్ టెక్నాలజీ అప్లికేషన్లు రూపొందించారు. ఈ సందర్భంగా సందీప్‌ను తెలంగాణ మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 04 Dec,2020 11:04AM